ఏజెంట్  ఆత్రేయ షూటింగ్ పూర్తి

08 Feb,2019

నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ జంటగా నటిస్తున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు స్వరూప్ RSJ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వినోదాత్మకంగా ఉన్న నవీన్ పొలిశెట్టి లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు మార్క్ K రాబిన్ సంగీతం అందిస్తుండగా.. సన్నీ కురపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మళ్లీ రావా లాంటి చిత్రాన్ని నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent News